1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Redmi Y3 arriving on April 24 with 32 MP selfie camera

24న షియోమీ రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్ విడుదల

Redmi Y3
భారత మొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షియోమీ సంస్థ తన నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ వై3 ని ఈ నెల 24వ తేదీన విడుద‌ల చేయనుంది. ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ భారీ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసారు. 
 
అలాగే స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది.

ఇక ఈ ఫోన్‌కి సంబంధించిన మిగిలిన వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ వివరాలు త్వరలో తెలుస్తాయి. కాగా ఈ ఫోన్ అమెజాన్‌లో మాత్రమే ప్రత్యేకంగా విక్రయించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
About Writer
మోహన్