1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. This smartphone malware can steal your banking details and delete all your data

బ్యాంకింగ్ మాల్వేర్ యమా డేంజర్.. సమస్త సమాచారం లూటీ

smartphone
బ్యాంకింగ్ మాల్వేర్ ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఆన్ లైన్ బ్యాంకుల లాగిన్ వివరాలతో పాటు ఫోన్ లో ఉన్న సమస్త సమాచారాన్ని ఇది లూటీ చేస్తుంది. ఆ మహా డేంజర్ ఆండ్రాయిడ్ మాల్వేర్ పేరు బ్రాటా. 
 
గత ఏడాది డిసెంబర్‌లో పలువురి బ్యాంకు వివరాలు చోరీ కావడం, వారి ఫోన్లలోని డేటా మొత్తం పోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంకింగ్ మాల్వేర్ లోనే మూడు రకాలున్నాయంటున్నారు. బ్రాటా.ఏ, బ్రాటా.బీ, బ్రాటా.సీగా వాటిని పిలుస్తున్నారు. 
 
ప్రస్తుతం బ్రిటన్, పోలండ్, ఇటలీ, స్పెయిన్, చైనా, లాటిన్ అమెరికా దేశాల్లోని నెట్ బ్యాంకింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బ్రాటాతో దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది.  
 
డౌన్ లోడర్ ద్వారా ఫోన్లలోకి ఎక్కిస్తున్న ఈ వైరస్‌ను యాంటీ వైరస్‌లు కూడా అడ్డుకోలేకపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మాజీ ముఖ్యమంత్రి మనవరాలు ఆత్మహత్య