సంబంధిత వార్తలు
- టిక్ టాక్, హెలో సహా 59 మొబైల్ యాప్స్ బంద్.. డ్రాగన్ కంట్రీ హెచ్చరిక
- టిక్‌టాక్ యాప్ ఇంకా పనిచేస్తోంది, వాడాలా వద్దా? నిషేధం ప్రభావం ఎలా ఉంటుంది?
- చైనా యాప్స్ నిషేధం: #RIPTikTok ట్రెండింగ్, ఆడుకుంటున్న నెటిజన్స్
- చైనా యాప్స్‌పై నిషేధం అంత ఈజీ కాదు సుమా? టెక్ నిపుణులు
- ఏ తప్పూ చయలేదు... ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు : టిక్ టాక్ ఇండియా
టిక్ టాక్ పోయింది.. చింగారీ వచ్చింది.. నెటిజన్లకు పండగే
Chingari
అయితే, టిక్ టాక్ ప్రభావంతో వీడియోలకు బాగా అలవాటు పడిన భారత నెటిజన్లు డీలా పడిపోయారు. అయితే టిక్ టాక్ పోతే పోయిందని.. దానికి బదులు ఇప్పుడు మరో యాప్ విశేషంగా ఆకర్షిస్తోంది. దీని పేరు 'చింగారీ'. ఇది దేశీయంగా రూపొందిన యాప్. దీన్ని మహీంద్రా గ్రూప్ అధినేత, టెక్ ప్రియుడు ఆనంద్ మహీంద్రా కూడా డౌన్ లోడ్ చేసుకోవడం విశేషం. ఈ యాప్ అచ్చం టిక్ టాక్ తరహాలోనే ఉంటుంది.
టిక్ టాక్‌పై నిషేధంతో ఈ 'చింగారీ' యాప్‌కు డౌన్ లోడ్లు విపరీతంగా పెరిగిపోయాయి. 60 నిమిషాల వ్యవధిలో ఈ యాప్‌ను లక్ష మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. ఇప్పటివరకు ఈ యాప్ 30 లక్షల డౌన్ లోడ్లు సాధించింది. అంతేకాదు, ఈ యాప్ వ్యూయింగ్ రేట్ కూడా ఎంతో మెరుగైంది. ఇది ఇంగ్లీష్, హిందీ, తెలుగు వంటి అనేక భారతీయ భాషల్లో లభ్యమవుతోంది.
