మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2023 (09:12 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఛానెల్ ఫీచర్.. ఇక సులభంగా..?

whatsapp
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇండియాలో ఇటీవల ప్రారంభించిన ఛానల్ ఫీచర్‌కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. టెలిగ్రామ్‌కి పోటీగా వచ్చిన ఈ ఛానల్ ఫీచర్‌ను ఇప్పటికే చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మెటా ఆధారిత వాట్సాప్ ఇందులో ఆటోమేటిక్ ఆల్బమ్ అనే కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ ఛానెల్‌లో, ఒక ఫోటో లేదా వీడియో మాత్రమే షేర్ చేయబడుతుంది. 
 
మామూలు వాట్సాప్‌లో ఇలా ఉండదు. బహుళ ఫోటోలు, వీడియోలను ఏకకాలంలో షేర్ చేయవచ్చు. దీనిని ఆటోమేటిక్ ఆల్బమ్ ఫీచర్ అంటారు. ఇప్పుడు వాట్సాప్ ఈ ఆటోమేటిక్ ఆల్బమ్ ఫీచర్‌ను ఛానెల్‌లో కూడా పరిచయం చేస్తోంది. 
 
ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్ వెర్షన్ 2.23.26.16లో ఉంది. త్వరలోనే అన్ని ఛానళ్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 
 
దీని నుంచి ఫోటోలు, వీడియోలను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీడియా కంటెంట్‌లను ఏకకాలంలో పంచుకోవడానికి ఈ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది.