సంబంధిత వార్తలు
- చెల్లితో కలిసి ఫేస్‌బుక్ ప్రియుడితో అక్క రాసలీలలు.. భర్తకు చూడగానే కత్తితో దాడి.. ఎక్కడ?
- అఖిల్ మజ్ను ట్రైలర్ కాపీల పుట్టా..? అబ్బా.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ.. (video)
- అర్థరాత్రి 11 గంటలకు ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో భార్య.. ఉన్నట్టుండి భర్త ఇంటికొచ్చాడు..
- కాజోల్-అజయ్ దేవగన్ ల మధ్య లడాయా? లవ్వాటా? నెటిజన్స్‌తో ఆడుకుంటున్నారు...
- ప్రణయ్ ఘటనపై రామ్ గోపాల్ వర్మ-అమృతను కలిసిన కౌసల్య?
ఫేస్‌బుక్‌తో జాగ్రత్త.. మీ ఫోన్ నెంబర్లను అలా వాడేసుకుంటుందట?
ఫేస్‌బుక్‌తో జాగ్రత్త. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫోన్ నెంబర్‌తో ఫేసబుక్ యాడ్స్ కోసం ఉపయోగించుకుంటుదందని సమాచారం. యూజర్లు ఇచ్చే ఫోన్ నెంబర్లను ఫేస్‌బుక్ ప్రత్యేకంగా టూ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ (2ఎఫ్‌ఎ
ఫేస్‌బుక్‌తో జాగ్రత్త. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫోన్ నెంబర్‌తో ఫేసబుక్ యాడ్స్ కోసం ఉపయోగించుకుంటుదందని సమాచారం. యూజర్లు ఇచ్చే ఫోన్ నెంబర్లను ఫేస్‌బుక్ ప్రత్యేకంగా టూ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ (2ఎఫ్‌ఎ) కోసం ఉపయోగిస్తుంది. అంటే ఫేస్‌బుక్ అకౌంట్లను మరింత భద్రంగా ఉంచేందుకు ఇది పనికొస్తుంది.
గిజ్‌మోడో అనే సంస్థ చేసిన పరిశోధన ద్వారా యాడ్స్ పంపించడానికి యూజర్ల ఫోన్ నంబర్లను వాడుతున్నామని ఫేస్‌బుక్ కూడా అంగీకరించింది. సెక్యూరిటీ కారణాల కోసం యూజర్లు ఇచ్చిన మొబైల్ నెంబర్లను, యూజర్లు ఇవ్వకపోయినా ఇతరుల కాంటాక్ట్ బుక్‌ల నుంచి సేకరించి వాటిని యాడ్స్ కోసం ఎఫ్‌బీ వాడుకుంటుందని గిజ్‌మోడో తెలిపింది. ఈ రిపోర్ట్‌పై స్పందించిన ఫేస్‌బుక్.. అది నిజమేనని చెప్పింది. ఈ అడ్వర్‌టైజింగ్ ద్వారా కూడా ఫేస్‌బుక్‌కు భారీగానే ఆదాయం వస్తుందనేది నిజం.
కాగా.. యూజర్ల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని ఎలా వాడుతున్నామని తమకు స్పష్టత వుందని.. యూజర్లు అప్ లోడ్ చేసే ఫోన్ నెంబర్లు ఇతర సమాచారాన్ని యూజర్లు డిలీట్ చేసుకోవచ్చునని ఫేస్ బుక్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.
