శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Modified: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:50 IST)

కాజోల్-అజయ్ దేవగన్ ల మధ్య లడాయా? లవ్వాటా? నెటిజన్స్‌తో ఆడుకుంటున్నారు...

బాలీవుడ్ సక్సెస్‌పుల్ కపుల్స్‌లో కాజోల్-అజయ్ దేవగన్‌లు ముందుంటారు. అజయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల ఆయన తన భార్య కాజోల్ నంబర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. కాజోల్ ఇండియాలో లేదు. మీరెవరైనా మాట్లాడాలనుకుంటే ఇదిగోండి నంబర్ అంటూ పోస్ట్

బాలీవుడ్ సక్సెస్‌పుల్ కపుల్స్‌లో కాజోల్-అజయ్ దేవగన్‌లు ముందుంటారు. అజయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల ఆయన తన భార్య కాజోల్ నంబర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. కాజోల్ ఇండియాలో లేదు. మీరెవరైనా మాట్లాడాలనుకుంటే ఇదిగోండి నంబర్ అంటూ పోస్ట్ చేసారు. ఇది కావాలనే చేసారా లేక పొరబాటున జరిగిందో మరి ఇంకా తెలియదు.
 
ఈ ట్వీట్‌పై కొందరు నెటిజన్లు వేళాకోలం చేయగా మరికొందరు సీరియస్‌గా సలహాలు ఇచ్చారు. అయితే ఆ హీరోకి మాత్రం ట్రోలింగ్‌లు భారీగా వచ్చాయి ట్వీట్స్ రూపంలో. ఆ నంబర్‌కు కాల్ చేస్తే ఫార్వార్డ్ వచ్చిందని, వాట్సప్‌లో మెసేజ్ పెడితే రిసీవ్ చేసుకోలేదని, మరొకరైతే నేను కాల్ చేశాను, కానీ కాజోల్ మాట్లాడను, వాట్సాప్ మాత్రమే చేస్తానందని ట్వీట్ చేసారు. ఇంకొకరైతే ఏం జరుగుతోందో అర్థం కాక ‘మేడమ్ మీ నంబర్‌ను దేవగణ్ సార్ ట్వీట్ చేశారు. వెంటనే వాట్సప్ డిలీట్ చేసేయండి’ అంటూ అడ్వైస్ ఇచ్చారు.
 
దేవగణ్ ఎందుకు ఇలా చేసారు, వారి మధ్య ఏదైనా గొడవ జరిగి ఎలాగైనా కాజోల్ వాట్సప్ డిలీట్ చేసేలా చేయడానికి ఇలా చేసారా లేక జనాల్ని ఆటపట్టించడానికి ఇలా చేసారో అర్థం కావాలంటే ఆయనే నోరు విప్పాలి మరి. సోషల్ మీడియా ఈ విధంగా కూడా ఉపయోగపడుతోందన్నమాట.