శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:52 IST)

ప్రణయ్ ఘటనపై రామ్ గోపాల్ వర్మ-అమృతను కలిసిన కౌసల్య?

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా అమృత తండ్రి మారు

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా అమృత తండ్రి మారుతిరావు.. ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా పెద్ద చర్చ సాగుతోంది. 
 
సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు ఈ ఘటనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రణయ్ ఘటనపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందించారు. ''అమృత తండ్రి మారుతీరావు క్రూరత్వం గల క్రిమినల్. ప్రణయ్‌ని హత్యచేసి ఆ కీర్తి ప్రతిష్టలను అతడు ఏం చేసుకోలేడు. ఒకవేళ అతను పరువుకోసమే హత్య చేసినట్లయితే.. అతను కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన పరువు హత్య అంటే పరువు కోసం హత్య చేసేవారిని హత్య చేయడమే'' అంటూ రాసుకొచ్చాడు.
 
ఇదిలా ఉంటే..  తమిళనాట 2016లో సంచలనం సృష్టించిన పరువు హత్య బాధితురాలు కౌసల్య.. ప్రణయ్ భార్య అమృతను కలిశారు. దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో.. కట్టుకున్న భర్తను ఆమె కళ్లెదుటే తండ్రి తరఫువాళ్లు దారుణంగా హత్య చేశారని అమృతకు చెప్పారు.

ఈ కేసులో వాదోపవాదాలు మద్రాసు హైకోర్టులో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి కౌసల్య కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యతో మరోసారి కౌసల్య - శంకర్‌ల ఉదంతం తెరపైకి వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం మిర్యాలగూడకు చేరుకున్న కౌలస్య.. అమృతను పరామర్శించారు. ప్రణయ్ హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అమృతను ఓదార్చి ధైర్యం చెప్పిన కౌసల్య.. తన భర్త హత్యకు సంబంధించిన వీడియోను అమృతకు చూపించారు.

ఈ సందర్భంగా ప్రణయ్ హత్యలో నిందితులకు బెయిల్ రాకూడదని బలంగా కోరుకుంటున్నానని.. వాళ్లు బయటకు వస్తే.. తనకు పుట్టబోయే బిడ్డకు కూడా హాని చేస్తారని అమృత ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు.