1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. 2G scam verdict on December 21

21న 2జీ కేసు తుది తీర్పు.. రాజా - కనిమొళిలు దోషులా?

దేశాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌ కేసులో ఈనెల 21వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించనుంది.

2G scam
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌ కేసులో ఈనెల 21వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీలోని పాటియాలా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ప్రకటించారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఏ.రాజా, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తుది తీర్పు కోసం డిసెంబర్ 21 వరకు వేచి చూద్దామన్నారు. గతంలో అనేక సార్లు ఈ కేసు వాయిదా పడింది. నవంబర్ 7వ తేదీన చివరి విచారణ జరిగింది. అయితే ఆ విచారణలో తుది తీర్పు తేదీని డిసెంబర్ 5వ తేదీన వెల్లడిస్తామని కోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ తుది తీర్పును ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో రాజా, కనిమొళితో పాటు మరో 19 మందిపై 2014లో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
జయలలిత నాన్నకు విషమిచ్చి చంపేశారు.. అమ్మకు ఆడబిడ్డ నిజమే: అత్త లలిత