ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (17:42 IST)

జయలలిత నాన్నకు విషమిచ్చి చంపేశారు.. అమ్మకు ఆడబిడ్డ నిజమే: అత్త లలిత

ముఖ్యమంత్రి దివంగత జయలలిత తొలి వర్థంతి వేడుకలు డిసెంబర్ 5వ తేదీ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో జయలలిత అత్త లలిత మరోబాంబు పేల్చారు.

ముఖ్యమంత్రి దివంగత జయలలిత తొలి వర్థంతి వేడుకలు డిసెంబర్ 5వ తేదీ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో జయలలిత అత్త లలిత మరోబాంబు పేల్చారు. జయలలిత నాన్నను ఆయన భార్య కొట్టి చంపేశారంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, జయలలిత - శోభన్ బాబులకు ఆడబిడ్డ పుట్టింది నిజమేనని చెప్పారు. 
 
జయలలిత మరణం అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలను కూడా జయలలిత కుటుంబీకులే వెల్లడించడం గమనార్హం. 
 
తాజాగా జయలలిత అత్త లలిత ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ, జయలలిత తండ్రి జయరామన్ మద్యానికి బానిస కావడంతో, ఆయన భార్య సంధ్య విషమిచ్చి భర్తను చంపిందని ఆరోపించారు. జయరామన్ హత్య తర్వాత ఆమె ఇగోను భరించలేక తాము ఆమెకు దూరంగా వెళ్లిపోయామని, ఆ తర్వాత జయ ఒక్కో మెట్టూ ఎదుగుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు. 
 
జయలలిత అమ్మ సినీ నటి కావడంతో కుమార్తెను సైతం ఆ దిశగానే ప్రోత్సహించిందని చెప్పారు. ఆ సమయంలో హీరో శోభన్ బాబుతో ఏర్పడిన పరిచయం కారణంగా జయలలిత గర్భం దాల్చిందనీ, ఆమెకు కాన్పు చేసింది కూడా తన పెద్దమ్మేనని చెప్పింది. ఆ బిడ్డే అమృత అని తెలిపింది. అయితే, జయకు పుట్టిన బిడ్డ అమృతేనని చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేవని అన్నారు. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ఒట్టు వేయించుకుందని లలిత వెల్లడించారు.