బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2017 (13:33 IST)

శోభన్‌బాబుతో సహజీవనం నిజమే.. అందుకే పెళ్లి చేసుకోలేదు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత -శోభన్ బాబుల సహజీవనం మళ్లీ తెరమీదకు వచ్చింది. జయలలిత కుమారి కాదని.. ఆమె పేరుకు ముందు కుమారి అని వేసుకోవడం సబబు కాదంటూ అప్పట్లో డీఎంకే పార్టీ నేతలు పెద్ద హంగామా చేసిన సంగతి తె

దివంగత ముఖ్యమంత్రి జయలలిత -శోభన్ బాబుల సహజీవనం మళ్లీ తెరమీదకు వచ్చింది. జయలలిత కుమారి కాదని.. ఆమె పేరుకు ముందు కుమారి అని వేసుకోవడం సబబు కాదంటూ అప్పట్లో డీఎంకే పార్టీ నేతలు పెద్ద హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత అనారోగ్యంతో మృతి చెందిన ఏడాది కావొస్తున్న తరుణంలో.. ఆమె వారసత్వంపై చర్చ సాగుతోంది.

అమృత అనే పేరిట ఓ మహిళ తానే జయలలిత కుమార్తెనంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో డీఎన్ఏ పరీక్షకు అంగీకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు.. కర్ణాటక కోర్టులో తేల్చుకోమంది. ఈ క్రమంలో జయలలిత 1979లో ఆంగ్ల పత్రికకు స్వయంగా రాసిన లేఖ మళ్లీ చర్చకు వచ్చింది. 
 
జయలలిత మరణం తర్వాత ఆమె వైవాహిక బంధం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇటీవల కోర్టుకెక్కిన బెంగళూరుకు చెందిన మంజుల అలియాస్ అమృత విషయం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. ఆమె జయకు, నటుడు శోభన్ బాబుకు పుట్టిన సంతానమేనని జయ స్నేహితురాలు కూడా నొక్కి చెప్పేశారు. ఈ విషయాన్ని శోభన్ బాబే తనతో స్వయంగా చెప్పారన్నారు.

శోభన్ బాబుతో సహజీవనం చేసినట్లు.. ఆయన వివాహితుడు కావటం వల్లే ఆయన్ని పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979లోనే జయలలిత అంగీకరించారు. ఈ మేరకు స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు స్వయంగా లేఖ రాశారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు.. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా చెప్పేశారు. 
 
అమృత కోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఆగస్టు 14, 1980లో జయలలితకు అమృత జన్మించారు. పెంపుడు తల్లి శైలజ 2015లో, తండ్రి ఈ ఏడాది మార్చి 20న మృతి చెందారు. జన్మనిచ్చిన తల్లి బతికి ఉన్నప్పుడు తాను కుమార్తెనని ప్రకటిస్తే ఆమె కీర్తి ప్రతిష్ఠలు దెబ్బతింటాయని భావించి ఇన్నాళ్లు దాచిపెట్టినట్టు అమృత తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశంతో అమృత ప్రస్తుతం కర్ణాటక కోర్టును ఆశ్రయించనున్నారు. డీఎన్ఏ టెస్టుకు తాను సిద్ధమని.. అలాగే అమ్మకు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.