మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2017 (09:50 IST)

శోభన్‌బాబు - జయలలిత సహజీవనం?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న అనేక రహస్యాలు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న అనేక రహస్యాలు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాన్ని 1979లో జయలలిత స్వయంగా వెల్లడించినట్టు బెంగళూరుకు చెందిన మంజుల అలియాస్ అమృత గుర్తుచేస్తున్నారు. 
 
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అమృత కర్ణాటక హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. అందులో ఆమె పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, హీరో శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, ఆయన వివాహితుడు కావడంతో పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979లోనే జయలలిత అంగీకరించారు. ఈ మేరకు స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు స్వయంగా లేఖ రాశారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. 
 
అంతేకాదు జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా చెప్పడం గమనార్హం. అమృత పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని కర్ణాటక హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. కోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఆగస్టు 14, 1980లో జయలలితకు అమృత జన్మించారు. పెంపుడు తల్లి శైలజ 2015లో, తండ్రి ఈ యేడాది మార్చి 20న మృతి చెందారు.  జన్మనిచ్చిన తల్లి బతికి ఉన్నప్పుడు తాను కుమార్తెనని ప్రకటిస్తే ఆమె కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయని భావించి ఇన్నాళ్లు దాచిపెట్టినట్టు అమృత అందులో పేర్కొన్నారు. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.