సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (13:00 IST)

డేరా బాబా 50 మంది భక్తురాళ్లపై అత్యాచారం చేశాడా? వాజ్‌పేయికి ఆమే లేఖ రాశారా?

ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పిన నోటితోనే పాప్ సాంగ్స్ పాడాడు. దేవుడని, ఆరాధ్య దైవమని నమ్మిన భక్తులను నట్టేట ముంచాడు. హైఫై జీవితానికి అలవాటుపడి.. అమ్మాయిలో సరసాలాడాడు. దీంతో భక్తి భావం నుంచి చీకటి వ్యాపార

ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పిన నోటితోనే పాప్ సాంగ్స్ పాడాడు. దేవుడని, ఆరాధ్య దైవమని నమ్మిన భక్తులను నట్టేట ముంచాడు. హైఫై జీవితానికి అలవాటుపడి.. అమ్మాయిలో సరసాలాడాడు. దీంతో భక్తి భావం నుంచి చీకటి వ్యాపారం పెరిగింది. అధికారం, అవినీతి, అరాచకం, అమ్మాయి లేనివాడు బాబా కాడేమో అన్నట్లు డేరా బాబా కూడా మారిపోయాడు. 2002లో నమోదైన హత్య, అత్యాచారం కేసుతో డేరా బాబా అసలు సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. 
 
అత్యంత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ డేరా బాబా.. తమకు అందిన విరాళాలతో అనేక స్థిరాస్తులు కొని, అనేక వ్యాపారాల్లో దిగాడు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆర్గానిక్ ఫామ్స్, కాలేజీలు, రిటైల్ స్టోర్సు, రిసార్టులు, హోటల్స్, మీడియా, క్రికెట్ స్టేడియాలు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు ఎన్నో ప్రారంభించారు. 
 
డేరా బాబాపై ఉన్న కేసులను చూస్తే, ఈ మొత్తం కథ అంతాకూడా 2002లో మొదలైంది. అప్పట్లో డేరాబాబా తనపై, ఆశ్రమంలోని ఇతర సాధ్వీలపై అత్యాచారం చేసినట్లుగా ఒక స్వాధ్వీ నాటి ప్రధాని వాజ‌పేయికి ఒక లేఖరాసింది. దీంతో ఈ బాబా అరాచకం బయటి ప్రపంచం దృష్టికి వచ్చింది. 
 
ఈ లేఖను సుమోటోగా స్వీకరించింది పంజాబ్, హైకోర్టు. సమగ్ర విచారణ జరపాల్సిందిగా 2002 సెప్టెంబర్ 24న సీబీఐని ఆదేశించింది. వాస్తవానికి 50 మంది వరకూ మహిళా భక్తురాళ్లపై అత్యాచారం చేసినట్టు బాబాపై ఆరోపణలున్నా ఇద్దరిపైనే అఘాయిత్యం చేసినట్టు డేరాబాబాపై ఆరోపణలు రుజువైనాయి.