ప్రేమ వివాహాలుపై నిషేధం విధించిన ఆర్యానగర్, కారణం అదేనంట
మన ఊరివాడే కదా, తెలిసినవాడు, చాలామంచివాడు... కాబట్టి అతడినే పెళ్లి చేసుకుంటాను అని ఆ ఊరిలో ఏ అమ్మాయి అయినా చెబితే ఊరుకోరు. అలాగే అబ్బాయి పరిస్థితి కూడా. ఒకవేళ ఒకే ఊరికి చెందిన యువతీయువకులు పెళ్లాడితే వారిని, వారి కుటుంబాలను బహిష్కరిస్తారట. ఇదంతా ఎక్కడో తెలుసుకుందాము. హరియాణా రాష్ట్రంలోని హిసార్ జిల్లా ఆర్యానగర్ గ్రామంలో ఇటీవల మూడు జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ ప్రేమ వివాహాలను పెద్దలు అంగీకరించలేదు. కానీ ప్రేమికులు పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకున్నారు. దీనితో విషయం కాస్తా పంచాయతీకి వెళ్లింది. అక్కడ గ్రామ పద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే... ఇకపై గ్రామంలో ఎవరూ ప్రేమ పెళ్లిళ్లు చేసుకోరాదు. గ్రామంలోని అమ్మాయిలు-అబ్బాయిలు సోదరసోదరీమణులతో సమానం. కనుక ఇక్కడివారు ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకోరాదు. ఒకవేళ అలా చేసుకుంటే గ్రామ బహిష్కరణ చేస్తామని తీర్మానం చేసారు. ఇది కాస్తా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
