1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Bihar Teacher's Bold Condom Practical in Class Goes Viral

కండోమ్, కీరదోసకాయతో సెక్స్ పాఠాలు...బీహార్ టీచర్ వినూత్న ప్రయోగం

cucumber - condom
బీహార్ రాష్ట్రంలోని పూర్నియాకు చెందిన ఓ బయాలజీ టీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తరగతి గదిలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వివరిస్తూ, కీర దోసకాయ, కండోమ్‌ను ఉపయోగించి ప్రాక్టికల్‌గా పాఠం చెప్పడమే ఇందుకు కారణం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
 
చందన్ కుమార్ పండిట్ అనే టీచర్, తనను తాను ఇన్‌స్టాలో ఇండియాస్ వైరల్ బయాలజీ సర్‌గా పరిచయం చేసుకున్నారు. ఇటీవల ఆయన పోస్ట్ చేసిన ఓ చిన్న వీడీయోలో కండోమ్‌ను ఎలా సరిగ్గా ఉపయోగించాలో చెప్పేందుకు కీర దోసకాయను మోడల్‌గా ఎంచుకున్నారు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల నివారణ, జనన నియంత్రణలో కండోమ్‌ల పాత్ర గురించి కూడా ఆయన విద్యార్థులకు వివరించారు. 
 
పుస్తకాల్లోని చదువుతో పాటు ఇలాంటి సున్నితమైన అంశాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రాక్టికల్ అవగాహన కల్పించడం ఎంతో అవసరమని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో ఆన్ లైన్‌లో పోస్ట్ అయిన కొద్ది సమయంలో లక్షలాది వ్యూస్ సాధించింది. 
 
టీచర్ చెప్పిన విధానాన్ని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తూ, ఇలాంటి ప్రాక్టికల్ విధానం అవసరమని కామెంట్స్ చేశారు. అయితే, పునరుత్పత్తి తరగతి గదిలో బోధించే పద్దతులపై ఈ వీడియో కొత్త చర్చకు దారితీసింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గణేష నిమజ్జనం- నిఘా నీడలో తెలంగాణ పైసా కూడా తీసుకోని డ్రైవర్.. అదుర్స్