1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Demand for cow dung in Chhattisgarh

ఛత్తీస్ ఘర్ లో ఆవు పేడకు డిమాండ్.. ఎందుకో తెలుసా?

cow dung
ఇన్నాళ్లూ ఆవు సెంటిమెంట్ తో ఆడుకున్న రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రం వెంటపడ్డాయి. ఛత్తీస్ ఘర్ లో ఈ రాజకీయం పరాకాష్టకు చేరింది. చత్తీస్‌ఘర్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నేరుగా ఇప్పుడు ఆవు పేడను కొంటోంది.

కేజీ రెండు రూపాయలకు రైతుల నుండి సేకరిస్తోంది. దీనికి 'గోధన్‌ న్యారు యాజన్‌' అనే పేరు కూడా పెట్టింది. ఈ పథకం కింద సేకరించిన పేడతో వర్మికంపోస్ట్‌ తయారుచేసి అన్నదాతలకు అందించనున్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం కారణంగా పశువులకు సరైన పశుగ్రాసం లభిస్తుందని, రైతులు లాభాలు ఆర్జిస్తారని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు మొదలవడానికి ముందు నిర్వహించే హరేలీ ఉత్సవంలో భాగంగా ఈ పథకాన్ని సిఎం భూపేశ్‌ భగేల్‌ ప్రారంభించారు.
తర్వాతి కథనం
ఎన్95 మాస్కుల కన్నా కాటన్ వస్త్రమే మేలు