శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (11:45 IST)

ఘోర ప్రమాదం.. కారు లోయలోపడి..8మంది మృతి

కారు లోయలో పడి 8మంది మృతి చెందిన సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి కారు వేగంగా వస్తూ అదుపుతప్పి లోయలో పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మొహభత్తా పట్టణ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన 8 మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది. 
 
ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ బాలుడు అక్కడికక్కడే మరణించారు. లోయలో నుంచి మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చామని జిల్లా ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు. 
 
మృతదేహాలకు శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి వారి బంధువులకు అప్పగిస్తామని కలెక్టరు శిఖా రాజ్ పుత్ తివారీ చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.25వేలను అందించామని కలెక్టరు తెలిపారు.