గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (14:06 IST)

కృష్ణా జిల్లాలో గుట్కా మాఫియా అరెస్టు

కృష్ణా జిల్లాలో గుట్కా మాఫియాను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లా కంచికచర్లకు రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న10 లక్షల 45 వేల రూపాయల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హైదరాబాద్ నుంచి కంచికచర్ల‌కు రెండు కార్లలో తరలిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పేరకలపాడు జాతీయ రహదారి వద్ద  రెండు కార్లలో ఉన్న గుట్కా స్వాధీనం చేసుకున్నారు. 
 
గుట్కాతో పాటు గుట్కా వ్యాపారం చేస్తున్న నందిగామ మండలం సోమవరం, ఐతవరం గ్రామానికి చెందిన పవన్, చక్రధర్, రాజాలతో పాటు మరో ఆరుగురు వ్యక్తులను రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.