ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (19:20 IST)

ఎన్95 మాస్కుల కన్నా కాటన్ వస్త్రమే మేలు (video)

ఎన్‌95 మాస్క్‌ల కన్నా ఇంట్లో కాటన్‌ గుడ్డతో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించడం సురక్షితమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్‌95 మాస్క్‌లు వాడొద్దని, అవి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేవని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

రాష్ట్ర ప్రభుత్వాల వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డిజిహెచ్‌ఎస్‌) లేఖ రాస్తూ.. ఎన్‌ 95 మాస్కులను ప్రజలు అసంబద్దంగా వాడుతున్నారని, ఇవి కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని, పైగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపయోగపడే చర్యలకు ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది.

వీటి కన్నా ఇంట్లో కాటన్‌ గుడ్డతో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించడం సురక్షితమని పేర్కొంది. ప్రతి రోజూ ఉతికి, శుభ్రం చేసుకునే గుడ్డ మాస్క్‌లను మాత్రమే వాడాలని సూచనలిచ్చింది.