శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (20:33 IST)

లాక్డౌన్ నిబంధనులు బేఖాతర్... బర్త్‌డే పార్టీ పెట్టిన వైద్యులపై కేసులు

లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న తరుణంలో పుట్టినరోజు పార్టీని ఏర్పాటు చేసుకున్న 11 మంది వైద్యులతో పాటు.. ఇద్దరు రిసార్ట్ మేనేజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పూణెలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్న కారణంగా పూణేలో 10 రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆదేశాలను పక్కనబెట్టిన వైద్యులు శుక్రవారం బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. 
 
'లాక్‌డౌన్‌లో మూసేసి ఉండాల్సిన రిసార్టు అర్థరాత్రి తెరిచారని, దానిలో కొందరు వ్యక్తులు చేరి పార్టీ చేసుకుంటున్నారని సమాచారం అందింది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం' అని పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో పాల్గొన్న 11 మంది వైద్యులతో పాటు.. ఇద్దరు రిసార్ట్ మేనేజర్లపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.