1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Economically Weaker Section Quota Rules Will Change Next Year: Centre

ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలు : సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

Economically Weaker Section
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు చెందిన విద్యార్థులకు వార్షిక ఆదాయంగా 8 లక్షల పరిమితిని విధించామని, దాన్ని పెంచొద్దని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. 
 
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే ప్రస్తుత విద్యా సంవత్సరానికి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అమలు చేస్తామని పేర్కొంది. ముఖ్యంగా నీట్ రాసిన విద్యార్థులకు ప్రవేశాలు, కాలజీలను కేటాయిస్తున్న తరుణంలో నిబంధనలు మార్చడం వల్ల సమస్యలు ఏర్పడతాయని పేర్కొంది. సవరించిన నిబంధనలను వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపింది. 
 
నిజానికి సవరించిన నిబంధనల్లో రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని కేంద్రం సర్కారు కొనసాగించింది. వ్యవసాయ భూమి ఐదు ఎకరాల కంటే అంతకుమించి ఎక్కువ ఉన్న వారిని మినహాయించింది. రూ.8 లక్షల ఆదాయ పరిమితిని క్రితం విచారణ సందర్భంగా కేంద్రం సమర్థించుకుంది. 
 
అయితే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి ఆదాయం, మెట్రో ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఆదాయంతో ఎలా ముడిపెడతారంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో నిబంధనలు సవరిస్తామని కోర్టుకు తెలిపింది. అయితే, ఇపుడు సవరించిన నిబంధనలను వచ్చే యేడాది నుంచి అమలు చేస్తామంటూ కోర్టుకు తెలిపింది. 
తర్వాతి కథనం
మంత్రి బొత్స సత్తిబాబు కాళ్లు మొక్కిన జిల్లా జాయింట్ కలెక్టర్