ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (17:25 IST)

ఒమిక్రాన్: మళ్లీ నైట్ కర్ఫ్యూ.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు

క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలు రాత్రి పూటే నిర్వహించే పరిస్థితి ఉన్నందున.. దీన్ని నివారించడానికి కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా- నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది కేంద్రం.
 
నైట్ కర్ఫ్యూను విధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలు పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలను రాయనున్నట్లు తెలుస్తోంది. 
 
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని, అన్ని ఆసుపత్రుల్లో 40 శాతం పడకలను సిద్ధం చేసుకోవాలని సూచించాలని నిర్ణయించింది. కోవిడ్ పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చిన ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా, క్లస్టర్లుగా ప్రకటించాలని రాష్ట్రాలకు సూచించ అవకాశం ఉంది.