సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (12:33 IST)

దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ : పార్టీ ఎంపీలతో ప్రధాని మోడీ అల్పాహార విందు

భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో బలోపేతంపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా దక్షిణ భారతదేశానికి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం అల్పాహార విందు ఇచ్చారు. వచ్చే 2023లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయన దక్షిణాదిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. 
 
ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీలతో మోడీ చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రధాని ఆరా తీశారు. 
 
వచ్చే 2023లోను గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కమలనాథులు దృష్టిసారించారు. ఇప్పటికే ఉత్తరాదిన తిరుగులోని శక్తిగా ఉన్న బీజేపీ... దక్షిణాదిలోనూ మరింతగా బలపేతం అయితే దేశంలో ఇక తమకు తిరిగులేదని భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు.