1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Kashi Vishwanath Dham corridor inauguration live updates

కాశీలోని ప్రతి రాయి శివుడే... ప్రధాని నరేంద్ర మోడీ

Kashi Vishwanath Dham Corridor
పవిత్ర పుణ్యస్థలం కాశీలో ప్రతి రాయిలోనూ శివుడు కొలువైవున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాశీ భారత సంస్కృతిక రాజధాని అని అన్నారు. ఇక్కడ ప్రతి రాయి ఓ పరమాత్మ స్వరూపుడైన శివుడే. కాశీకి సేవ చేయడం అనంతం అని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలందరికీ రాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉండాలన్నారు. 
 
మన దేశంలో భక్తికి కొదవలేదన్నారు. ఆ భక్తిని ఢీకొనే శక్తి దేనికీ లేదన్నారు. అంతేకాకుండా, భారత్ సనాతన సంప్రదాయాలకు ప్రతీక వారణాసి అని అన్నారు. నేటి భారత్ గతంలో కోల్పోయిన వైభవాన్ని అందుకుంటోందన్నారు. చోరీకి గురైన అన్నపూర్ణ విగ్రహం మళ్ళీ వందేళ్ళ తర్వాత భారత్‌కు వచ్చిందన్నారు. 
 
అంతేకాకుండా, ఆయన దేశ ప్రజలకు ఓ మరో పిలుపునిచ్చారు. దేశం కోసం దేశ ప్రజలంతా మూడు సంకల్పాలను తీసుకోవాలన్నారు. స్వచ్ఛత, సృజన్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని ప్రధాని మోడీ కోరారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కోతికి మళ్లీ ప్రాణం పోసిన ప్రభు - నెటిజన్ల సంతోషం