1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (12:19 IST)

కాశీ విశ్వనాథ్ కారిడార్ అంటే ఏంటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించారు. ఇందుకోసం 339 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు యూపీ అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇందులోభాగంగా, అనేక ప్రాజెక్టుల కోసం అభివృద్ది పేరుతో నిధులు విడుదల చేస్తున్నారు. అలాంటి ప్రాజెక్టుల్లో కాశీ విశ్వనాథ్ కారిడార్ ఒకటి. 
 
ఈ కారిడార్‌లో భాగంగా సోమవారం తొలి దశలో కొన్ని పనులకు ప్రధాని మోడీ ప్రారంభించారు. దాదాపు 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న సుమారు 23 బిల్డింగ్‌లను ఆయన ప్రారంభించారు. గతంలో ఈ ప్రాంతంలో 3000 చదరపుటడుగుల స్థలం ఇక్కడ వినియోగంలో ఉండేది. ఇపుడు దీన్ని 3 లక్షలకు పెంచారు. 
 
అలాగే, కాశీ విశ్వనాథ ఆలయాలన్ని ఓ కొత్త థామంగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే, ఈ కారిడార్ అభివృద్ధి యూపీ సర్కారు ఏకంగా 300 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం 1400 మంది వ్యాపారులు, ఇంటి యజమానుల నుంచి స్థలాలు, షాపులు, ఇళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వీరికి మరో చోట స్థలాలను కేటాయించారు. ఇందుకోసం ఓ చట్టాన్ని రూపొందించారు. 
 
అలాగే, పురాతన కాలం నాటి ప్రాపర్టీలను తొలగించే క్రమంలో 40 ప్రాచీన ఆలయాలను కొత్తగా గుర్తించారు. ఈ ఆలయాలను మరింత శోభాయమానంగా సుందరీకరించనున్నారు. వీటితో పాటు.. మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టారు.