బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (15:36 IST)

పార్లమెంట్‌పై దాడికి 20 ఏళ్లు: అమరులకు రాష్ట్రపతి నివాళులు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే భారత పార్లమెంట్‌పై దాడి జరిగి 20 ఏళ్లు గడిచాయి. ఈ ఉగ్రవాది నిలువరించి, తమ ప్రాణాలను అర్పించిన వీరులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాళులర్పించారు.

వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. 2001 డిసెంబరు 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన భద్రతా సిబ్బందికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులర్పించారు. 
 
2001లో సరిగ్గా ఇదేరోజున ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నానని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌పై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.