ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - బిట్ కాయిన్స్‌కు ఆమోదమంటూ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ తర్వాత బిట్ కాయిన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటూ ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా, దేశంలోని ప్రతి ఒక్కరికీ 500 బిట్ కాయిన్లను పంచుతుందంటూ ఒక స్కామ్ లింక్‌ను అందులో షేర్ చేశారు. ఆ తర్వాత ఆ ఖాతాను కాసేపటికి పునరుద్ధరించారు. అయితే, ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం ఈ పోస్టును పెద్దగా పట్టించుకోలేదు.
దీనిపై పీఎంవో స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్దిసేపు హ్యాక్ అయిందని, ఈ విషయాన్ని ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి ఖాతను పునరుద్ధరించినట్టు ఆదివారం తెల్లవారుజామున పీఎంవో ఓ ట్వీట్ చేసింది. హ్యాక్ అయిన సమయంలో ఆ ఖాతా నుంచి షేర్ చేసిన విషయాలను ఏమాత్రం పట్టించుకోవద్దని పీఎంవో సూచన చేసింది.