1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Extended Range Pinaka (Pinaka-ER) Multi Barrel Rocket Launcher System successfully

భారత ఆర్మీ అదుర్స్.. పినాక రాకెట్‌ లాంచ్ సక్సెస్

Pinaka
Pinaka-ER
భారత ఆర్మీ మరో అడుగు ముందుకేసింది.  దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్‌ లాంచర్‌ అభివృద్ధి చేసింది. శనివారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్వోడీఓ), ఆర్మీ సంయుక్తంగా చేసిన  శ్రేణి పినాకా (పినాకా-ఈఆర్) మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. 
 
పినాక-ఈఆర్‍ను డీఆర్వోడీవో మరియు లేబొరేటరీ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీతో కలిసి రూపొందించాయి.  
 
ప్రయోగాల్లో భాగంగా గత మూడు రోజులుగా వివిధ శ్రేణులు, వార్‌హెడ్‌ల సామర్థ్యాలతో 24 రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతమైన‌ట్టు, అన్ని ప్రయోగాలు ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు అందించిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.
తర్వాతి కథనం
జగన్ గారు మంత్రి పదవి ఇస్తానన్నారు, ఆ కబురు కోసం చూస్తున్నా: నటుడు అలీ