1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Father Raped Daughter

కన్నకూతురినే కాటేసిన తండ్రి.. కన్నబిడ్డపైనే అత్యాచారం.. భార్య ఉన్న గదికి గడియపెట్టి..?

విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైన భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన తండ్రి... కన్నకూతురినే కాటేశాడు. కామం కళ్లను కప్పేయడంతో కోరిక తీర్చుకోడానికి స్వయంగా కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమా

Father
విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైన భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన తండ్రి... కన్నకూతురినే కాటేశాడు. కామం కళ్లను కప్పేయడంతో కోరిక తీర్చుకోడానికి స్వయంగా కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ దారుణం కాలాపత్తర్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే.... కాలాపత్తర్‌ తాడ్‌బన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పదమూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది.
 
ఈ దంపతులకు 12 సంవత్సరాల కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా మూడు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని వేర్వేరుగా జీవిస్తున్నారు. విడాకులు ఇచ్చిన భార్య వద్దకు అతడు అప్పుడప్పుడు వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీ భార్యా బిడ్డను చూడడానికి వెళ్లిన భర్త... భార్య ఉన్న గదికి బయట గడియపెట్టాడు. 
 
కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడు మరో గదిలో ఉన్న కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పగా..ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
About Writer
chitra