సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (23:17 IST)

బాయ్‌ఫ్రెండ్‌తో సొంతూరికి మైనర్ బాలిక.. రాత్రంతా సామూహిక అత్యాచారం..

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బీహార్, చంపారన్ జిల్లుకు చెందిన 16 ఏళ్ల యువతి.. ఓ యువకుడి ప్రేమలో వుంది.

అయితే ఈ బాలిక గతవారం రాత్రి సమయంలో సొంత గ్రామానికి యువకుడితో కలిసి బైక్‌పై బయల్దేరింది. కానీ మార్గ మధ్యంలో మద్యం మత్తులో ఉన్న మృగాళ్లు వారిని అడ్డగించి ఆమె ప్రేమికుడిని చితకబాదారు. ఆపై బాలికను వేరు ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఇలా రాత్రంతా బాలికపై అత్యాచారం చేసిన కామాంధులు వేకువజామున 4 గంటల సమయంలో ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఈ ఘటనతో బాధితురాలు అవమాన భారంతో ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. పరారిలో వున్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.