ఎట్టెట్టా!... మలద్వారం నుంచి కాదు మెడ నుంచి గుడ్డు పెడుతున్న కోడి...?

hen - egg
Last Updated: ఆదివారం, 28 జులై 2019 (10:57 IST)
సాధారణంగా కోడి మలద్వారం నుంచి గుడ్డుపెడుతుంది. కానీ, ఆ కోడి మాత్రం మెడ నుంచి గుడ్డు పెడుతోంది. ఈ వింతను చూసేందుకు ఆ ప్రాంతవాసులంతా క్యూకడుతున్నారు. ఈ ఘటన కర్నాటక జిల్లాలోని మాండ్యా జిల్లాలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోడి మెడ నుంచి గుడ్డు పెడుతుందనే వార్త స్థానికంగా వైరల్ అయింది. అసలు మెడ నుంచి కోడి గుడ్డుపెట్టడమేంటనే కదా మీ సందేహం.

ఇదే అనుమానం స్థానికుల్లోనూ వచ్చింది. దీంతో కోడి మెడ నుంచి గుడ్డు పెడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. ఈ న్యూస్ కాస్త క్షణాల్లో వైరల్ అయిపోయింది.

ప్రపంచంలో ఎక్కడా, ఏ కోడీ మెడ నుంచి గుడ్డు పెట్టగా తాము చూడలేని ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతుంటే.. గ్రామస్థులు మాత్రం కోడిని చూసేందుకు క్యూకడుతున్నారు.దీనిపై మరింత చదవండి :