సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (11:25 IST)

ఓరి దేవుడా? మరుగుదొడ్లలో అన్నం వండుతున్నారా?

గతంలో రైళ్లల్లో బాత్రూమ్ నీటిలో చాయ్ అమ్మే ఫోటో వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా మరుగు దొడ్లలో మధ్యాహ్నం వండుతున్న ఫోటోలు వివాదానికి తావిచ్చాయి. టాయిలెట్స్‌లో భోజనం వండటమే కాకుండా.. వండితే తప్పేంటని మంత్రిగారే ప్రశ్నించారట. 
 
మధ్యప్రదేశ్‌లో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు వడ్డించే భోజనాన్ని మరుగుదొడ్లలో వండుతున్నారని ఇటీవల స్థానిక మీడియా చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి.
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తి దేవి దీనిపై స్పందించారు. మరుగుదొడ్లలో వంట చేస్తే తప్పేంటి.. టాయిలెట్ సీటుకు, వంట చేసే స్టవ్‌కు మధ్య గ్యాప్ ఉంటే సరిపోతుందని అన్నారు. ఈరోజుల్లో అందరి ఇళ్లల్లోనూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయని.. అంతమాత్రానా ఇంట్లో భోజనం చేయకుండా ఉంటున్నామా? అని ఎదురు ప్రశ్నించారు. 
 
ఇక అంగన్‌వాడీలో వెలుగుచూసిన ఘటనపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ టాయిలెట్‌ వినియోగంలో లేకపోవడంతోనే దాన్ని గులకరాళ్లతో నింపేసి కిచిన్‌గా వాడుతున్నారని చెప్పారు. వినియోగంలో లేదు కాబట్టే.. వంట పాత్రలను టాయిలెట్ సీట్‌పై పెట్టారని.. అలా పెట్టినంత మాత్రానా ఏమవుతుందని అన్నారు. ఏదేమైనా దీనిపై విచారణ చేయిస్తామని తెలిపారు.
 
ఈ ఘటనపై జిల్లా అధికారి దేవేంద్ర సుంద్రియాల్ మాట్లాడుతూ.. అక్కడ మధ్యాహ్నా భోజనం వండుతున్న స్వయం సహాయక బృందం టాయిలెట్‌ను కిచెన్‌లా వాడుతున్నారని అన్నారు. ఆ అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకున్నామన్నారు.