శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (09:58 IST)

మరుగుదొడ్లు - మురుగు కాల్వలు శుభ్రం చేసేందుకు ఎంపీకాలేదు : బీజేపీ ఎంపీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్వచ్ఛభారత్‌కు అమిత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం ఆయన స్వయంగా చీపురు పట్టుకుని వీధులు ఊడ్చుతున్నారు. పైగా, ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్‌లో పాల్గొనాలంటూ పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా, స్వచ్ఛ భారత్ అమలు కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమం అమలుకు బీజేపీ ఎంపీల నుంచే వ్యతిరేక వస్తోంది. స్వచ్ఛభారత్‌కు ప్రతి ఒక్కరూ కలిసిరావాలంటూ ప్రధాని మోడీ ఒకవైపు పిలుపునిస్తుంటే సాధ్వీ మాత్రం విమర్శలు చేసి కమలనాథులను చిక్కుల్లో పడేశారు. 
 
తాజాగా బీజేపీకి చెందిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరుగుదొడ్లు కడిగేందుకు తాను ఎంపీని కాలేదని వ్యాఖ్యానించింది. పైగా, ప్రజలకు ఏం చేస్తానని చెప్పానో అవన్నీ చేస్తానని చెప్పారు. తాను ఇచ్చిన హామీలను నిజాయితీగా చేసేందుకు కట్టుబడివున్నట్టు చెప్పారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోర్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, మరుగుదొడ్లు, మురుగు కాల్వలు శుభ్రం చేయడానికి తాను ఎంపీని కాలేదంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం చెప్పి ఎంపీని అయ్యానో వాటినన్నింటిని పూర్తిగా, నిజాయితీగా చేస్తానని హామీ ఇచ్చారు.