సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 21 జులై 2019 (18:07 IST)

నెటిజన్లు ఓ ఆడుకుంటున్నారు.. చర్యలు తీసుకోండి : అనసూయ

తెలుగు బుల్లితెర యాంకర్లలో సీనియర్ యాంకర్‌గ ఉన్న అనసూయను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. దీంతో ఆమెకు పిచ్చెక్కిపోతోంది. తాజాగా తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరింది. 
 
ముఖ్యంగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్, అసభ్యకరమైన పోస్టులు ఎక్కువైన విషయం తెల్సిందే. ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇలాంటి పోస్టులకు బాధితురాలేనని తెలుస్తోంది. సోషల్ మీడియాలో అనసూయపై అభ్యంతకరమైన రీతిలో పోస్టులు పెడుతున్నారంటూ ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
యాంకర్ అనసూయ పేరుతో సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అశ్లీల, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి అసభ్యకర పోస్టులు పోస్ట్ చేసిన వారి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.