సినీ ఇండస్ట్రీని వదిలేస్తున్నా... కాపుల కోసం పని చేస్తానంటున్న నటి హేమ

hema
Last Updated: బుధవారం, 17 జులై 2019 (19:25 IST)
సినిమా ఇండస్ట్రీలో నటి హేమకు ఫైర్ బ్రాండ్ అనే పేరు వుంది. ఎందుకంటే ఆమె ఏదయినా ముఖం మీదే మాట్లాడేస్తుంది. చాటుగా ఓ మాట, ముఖం మీద ఇంకో మాట అనేది వుండదు. చెప్పాల్సింది చెప్పేస్తుందంతే. అందుకే ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈమధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఆమె స్పందించింది. ఐతే ఇక తను సినిమాలను వదిలేసి ప్రజా సేవకు అంకితం కావాలనుకుంటున్నట్లు చెపుతోంది.

త్వరలో సినిమా ఇండస్ట్రీని వదిలేసి రాజమండ్రిలో స్థిరపడబోతున్నట్లు తెలిపారు హేమ. అక్కడ ఇప్పటికే ఓ ఇల్లు కట్టుకున్నాననీ, ఇకపై అక్కడే వుండబోతున్నట్లు వెల్లడించింది హేమ. అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా వుందంటూ ఆయనపై పొగడ్తల జల్లు కురిపించింది.

కాపుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించడం హర్షణీయమనీ, ఆయన కాపుల కోసం మరింతగా ఆలోచన చేస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. నటి హేమ మాటలను బట్టి చూస్తుంటే ఆమె వైసీపిలో చేరే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :