శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 19 జులై 2019 (12:57 IST)

నన్నెవ్వరూ ఏమీ చేయలేరు.. నేనే అధ్యక్షుడిగా కొనసాగుతా...

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీకి చెందిన అధినాయకులను మారుస్తారన్న ప్రచారం బాగానే సాగుతోంది. పార్టీని బలోపేతం చేయడంలో కొంతమంది ఫెయిలయ్యారని.. దీంతో అమిత్ షా వారిపై ఆగ్రహంతో ఉన్నారని, ఏ క్షణమైనా అధ్యక్షులు మారే అవకాశం ఉందన్న ప్రచారం ఆ పార్టీలోనే తీవ్రస్థాయిలో జరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో తిరుపతిలో పర్యటించారు కన్నా లక్ష్మీనారాయణ. కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. తానే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎపిలో బిజెపిని పటిష్టపరచడంలో తాను సఫలీకృతుడినయ్యానని, అందుకే అమిత్ షా తనను ఆ పదవి నుంచి తొలగించరన్న నమ్మకం ఉందన్నారు కన్నా. 
 
సభ్యత్వ నమోదులో కూడా ఎపిల ముందంజలో వున్నామన్న కన్నా లక్ష్మీనారాయణ.. వైసిపి నుంచి బిజెపిలోకి నేతలు క్యూ కడుతున్నారని చెప్పుకొచ్చారు. త్వరలో మరికొంతమంది నేతలు బిజెపిలో చేరుతారని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ 40 రోజుల పాలన అస్తవ్యస్తంగా తయారైందని.. రైతులు విత్తనాలు లేక, పంట చేతికందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.