శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 23 జులై 2019 (22:47 IST)

కంప్యూటర్ ముందు పని... కంటి జాగ్రత్తలు ఎలా?

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేస్తూ కూర్చునే వారికి కంటికి సంబందించి పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కళ్ల నుండి నీరు రావడం, వేడిగా అనిపించడం, కళ్లు మంట, నల్లని వలయాలు వంటి సమస్యలు వస్తుంటాయి. వీటినుండి ఉపశమనం పొందాలంటే ఇలా చేయాలి.
 
1. టమోటా గుజ్జు, పసుపు, నిమ్మరసం, శనగపిండిని పేస్టులా చేసి కళ్ల చుట్టూ రాసుకుని ఆరిన తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
2. రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా ఆల్మంచ్ క్రీంను కంటి చుట్టూ రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి.
 
3. కమలాపండు రసంలో నాలుగు చుక్కలు పాలు కలిపి కళ్ల కింద సున్నితంగా రాయాలి. క్రమంతప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
4. రోజ్ వాటర్లో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని అయిదు నిమిషములు ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన కంటి సంబందిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
 
5. రాత్రి పడుకునే ముందిు కీరదోస రసాన్ని కంటి చుట్టూ పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.