బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 జులై 2019 (15:51 IST)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
ఈ ఐఆర్ 2019 జూలై  నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో తాజా నిర్ణయం తీసుకున్నారు.

ఆయన నిర్ణయం పట్ల రాష్ట్ర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటూ మిఠాయిలు పంచుకుంటున్నారు.