కొండపల్లిలో ఆఫ్మెల్ ఉద్యోగులపై యాజమాన్యం వేధింపులు
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో ఉన్న ఆఫ్మెల్ ఉద్యోగులు, సిబ్బందిపై సింగరేణి యాజమాన్యం గత కొంతకాలంగా పలు విధాలుగా, వేధింపులకు గురిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చేందిన సింగరేణి యాజమాన్యం, కబంధహస్తాలలో చిక్కుకున్న, ఉద్యోగులు, సిబ్బంది, అహర్నిశలు కష్టపడిన వారిపై పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది.
కాగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నతాధికారులకు, సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెలియజేయాలని, ప్రయత్నిస్తున్నప్పటికీ కనీసం వారికి ఉద్యోగ భద్రతలేని పరిస్థితులు నెలకొని ఉనాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ సంస్థలో వివక్షతున్నట్లు సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సింగరేణి యాజమాన్యం ఆంధ్రాలో ఉన్న సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులపై పలు రకాలుగా, వివక్షత చూపుతున్నట్లు ఆరోపిస్తున్నారు.
అలాగే సింగరేణి యాజమాన్యం ఆంధ్రలో ఉన్న ఆఫ్మెల్‌ను లాభాల బాటలో పయనించలేదని తెలిసినది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పందించి కొండపల్లిలోని అఫ్మెల్‌పై అధికారులు స్పందించి విచారణ జరపాలని కార్మికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.