శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (18:46 IST)

టిప్ టాప్‌గా రెడీ అయి వస్తారు.. టిక్ టాక్‌లో వీడియోలు పోస్టు చేస్తారు.. (video)

సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై బాగా పడింది. స్మార్ట్ ఫోన్ చేతిలో వుంటే చాలు.. టిక్ టాక్ వీడియోలు, సెల్ఫీలంటూ జనం రెచ్చిపోతున్నారు. డబ్ స్మాష్‌లు, వీడియోలు టిక్ టాక్, షేర్ ఇట్ యాప్‌ల్లో పోస్టు చేసేస్తున్నారు. ఇలాంటి యాప్‌లకు ప్రజలేంటి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడిక్ట్ అవుతున్నారు.


ఈ క్రమంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది టిక్ టాక్‌లో మునిగి తేలుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు వారి సెక్షన్లు, డిపార్టుమెంట్లు మార్చారు. 
 
గత కొంత కాలంగా కార్పొరేషన్ ఉద్యోగులు టిప్ టాప్‌గా తయారై వచ్చి, టిక్ టాక్ వీడియోలను తీసుకుంటూ, విధులను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడిందని విమర్శలు రావడంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు, తొలుత వారి సెక్షన్లను మార్చారు.


ఆ తరువాత కూడా వీరి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటంతో, ఈ వీడియోలు చేసిన అందరినీ శానిటేషన్ విభాగానికి మారుస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.