శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (10:47 IST)

ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఎస్.ఐలు... మరో ఇద్దరు కూడా ఉద్యోగస్తులే...

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీఆర్ నగర్‌లో నివశించే ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు ఎస్ఐ‌లుగా ఎంపికయ్యారు. మరో సోదరుడు కానిస్టేబుల్‌గా ఎంపిక కాగా, ఇంకో సోదరుడు సింగరేటి 2ఏ బొగ్గుగనిలో ఉద్యోగాన్ని కొట్టేశాడు. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సోదరులు ఎస్.ఐలుగా ఎంపిక కావడం చాలా అరుదైన విషయంగా స్థానికులు చెపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గోపతి శoకరయ్య, తల్లి భాగ్యలక్ష్మి అనే దంపతుల సొంత ఊరు తిర్యాని మండలం గోయుగం. వీరికి ఐదుగురు కొడుకులు. 
తన రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతో శ్రమించి తనకున్న ఐదుగురు కొడుకులను గొప్ప చదువులు చదివించాడు. 2వ కొడుకు వెంకటేష్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించి కొన్నిరోజులు చేసి ఆ జాబ్ రిజైన్ చేశాడు. ఆ తర్వాత సివిల్‌కు ప్రిపేర్ అయి 2011లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించారు. 
 
ప్రస్తుతం గోదావరిఖని 1టౌన్ లో విధులు నిర్వహిస్తున్నారు. అదే సంవత్సరంలో తన పెద్దన్నయ్య రవీందర్ కానిస్టేబుల్ సంపాదించి ఆ జాబ్‌కి రిజైన్ చేసి ఎస్ఐకి ప్రిపేరై 2012లో ఎస్ఐగా ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం జాగిత్యాలో ఎస్.బి. ఎస్ఐగా విధులు నిర్వహిసిస్తున్నాడు. తండ్రి కేన్సర్ పేషేంట్ అయినందున 3వ కొడుకు సంతోష్ తన సింగరేణి ఉద్యోగం పెట్టించాడు. తర్వాత కొన్ని నెలల్లోనే తండ్రి చనిపోయాడు. ఇక మిగిలిన ఇద్దరు కొడుకులైన సురేష్, నరేష్ 2018లో టిఎస్ఎస్ కానిస్టేబుల్స్‌గా ఉద్యోగం సంపాదించి ఆ జాబ్‌కి రిజైన్ చేసి సివిల్‌కి ప్రిపేర్ అయ్యరు. 
 
ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఎస్.ఐ ఫలితాల్లో వీరిద్దరూ ఎస్.ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన తన పిల్లలని చాలా కష్టపడి చదివించి ప్రయోజకులను చేసినందుకు తల్లి భాగ్యలక్ష్మి ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. ఈ సమయములో మా నాన్న గారు బ్రతికిఉంటే ఉంటే చాలా సంతోషించేవారని కొడుకులు చెప్పుకొచ్చారు.