శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జులై 2019 (12:46 IST)

సచివాలయాన్ని కూల్చకూడదంటూ... గవర్నర్‌తో అఖిలపక్షం నేతలు

తెలంగాణ సచివాలయాన్నికూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో అఖిలపక్ష నేతలు సమావేశంకానున్నారు. 
 
ఈ నెల 7వ తేదీన జి.వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాల ప్రతిని గవర్నర్‌కు అందజేయనున్నారు. సచివాలయం 
కూల్చివేత నిర్ణయంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాలు...
 
1. సెక్రెటేరియట్ భవనాలను. ఎర్రంమంజిల్ భవనాన్ని కూల్చరాదు.
2. సెక్రెటేరియట్, అసెంబ్లీలను ఇప్పుడున్న భవనాలలోనే కొనసాగించాలని, కూల్చివేతలు, కొత్త భవనాల నిర్మాణాలకు నిధులను దుర్వినియోగం చేయరాదని డిమాండ్ 
3. చారిత్రక వారసత్వ కట్టడాల విధ్వంసాన్ని అడ్డుకోవాలి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఉనికిని కాపాడాలి.
4. పై డిమాండ్ల సాధనకు గవర్నర్‌‌ను కలిసి మెమోరాండం ఇవ్వాలని, జిల్లాల్లో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశాలను జరపాలని సభ నిర్ణయించింది. అందుకు ప్రజాస్వామిక తెలంగాణ చొరవ తీసుకోవాలని సభ కోరుతున్నది. ప్రత్యక్ష కార్యాచరణకు వెనుకాడమని అఖిల పక్షం ప్రకటిస్తున్నది.
5. అత్యున్నత న్యాయ స్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.
6. కొత్త నిర్మాణాలు, భవనాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.