సంబంధిత వార్తలు
- ప్రధాని క్రేజ్ ఏమైంది..? మోదీ ''మన్ కీ బాత్" ఎపిసోడ్‌కు డిస్‌లైకులు
- నీట్ - జేఈఈ పరీక్షలు వాయిదా వేయొద్దు - 150 మంది విద్యావేత్తలు లేఖ
- జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలను వాయిదా వేయండి.. సోనూసూద్ డిమాండ్
- ఒన్ నేషన్... ఒన్ రేషన్ కార్డు విధానంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం: ప్రధానమంత్రి
- నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని బాధితురాలు వెళితే...
నేటి నుంచి జెఈఈ పరీక్షలు
2021 ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ–మెయిన్ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) 4వ విడత పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి.
మే లో జరగాల్సిన ఈ పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షలు సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి. కాగా, ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
తొలిరోజు పేపర్–2 అయిన బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి.
జేఈఈ మెయిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సెషన్ పూర్తయిన తరువాత సెప్టెంబర్ మూడో వారంలో తుది విడత ఫలితాలను అభ్యర్థుల ర్యాంకులతో సహా ఎన్‌టీఏ ప్రకటించనుంది.
తర్వాతి కథనం
