1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. lockdown again! : World Health Organization

మళ్ళీ లాక్డౌన్ తప్పదేమో! : ప్రపంచ ఆరోగ్య సంస్థ

lockdown
ఇటీవలి కాలంలో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి... ఇప్పుడు కొత్త వేరియంట్ల రూపంలో మళ్లీ పంజా విసురుతోంది. అనేక దేశాల్లో కరోనా మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి.

గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా మరణాలు సంఖ్య 21 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా కేసులు కూడా 8 శాతం పెరిగాయని చెప్పింది. మరణాలలో దాదాపు 69 వేలకు పైగా మరణాలు ఆగ్నేయాసియా దేశాల్లోనే నమోదయ్యాయని తెలిపింది.
 
ఇప్పటి వరకు 194 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. రానున్న రెండు వారాల్లో కేసుల సంఖ్య 200 మిలియన్లను దాటేస్తుందని చెప్పింది.

అమెరికా, ఇండియా, బ్రెజిల్, ఇండొనేషియా, యూకే లతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. యూరప్ మినహా అన్ని దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతున్నాయని చెప్పింది.
About Writer
ఎం
తర్వాతి కథనం
భర్త బ‌య‌ట‌కు వెళ్లగానే ప్రియుడితో చాటింగ్, చివ‌రికి హ‌త్య‌