బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 మే 2021 (09:53 IST)

ప్రపంచ ఆరోగ్య సంస్థ 100 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల సాయం

కోవిడ్ రోగులకు అత్యవసర చికిత్స నిమిత్తం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యు.హెచ్.ఓ) 100 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందజేసిందని కోవిడ్-19 స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

వీటిని ఇప్పటికే విశాఖ జిల్లాలో వివిధ కోవిడ్ కేర్ సెంటర్లలో అత్యవసర చికిత్స నిమిత్తం వినియోగంచేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అర్జా శ్రీకాంత్ ను స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.బి.ఎస్.హెచ్. దేవి,  ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వైవలెన్స్ మెడికల్ ఆఫీసర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధిని మరో 100 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించాలని.. వాటిని అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ లో వినియోగించుకుంటామని అర్జా శ్రీకాంత్ కోరారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి కూడా సానుకూలంగా స్పందించారు.