శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 11 మే 2021 (22:53 IST)

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ, అందువల్లే 11 మంది చనిపోయారని వివరణ

ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని ప్రధానమంత్రి మోదీని కోరారు సీఎం జగన్. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి కేటియించాలని విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం అందుతున్న 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏపీకి సరిపోవడం లేదని తెలిపారు. 
 
తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నాం. ఈనెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యమైంది. ఆక్సిజన్ రావడం ఆలస్యమవ్వడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 ఎంటి ఆక్సిజన్‌ను 150 ఎంటికి పెంచాలని విన్నవించారు. 
 
ప్రస్తుతం ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 400 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. భారత్ బయోటెక్ కోవాగ్జీన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరీశీలించాలని లేఖలో పేర్కొన్నారు సీఎం. 
 
పెద్దమొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరనీ, దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థ కోవాగ్జిన్ ఒక్కటేనని తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరించాయని తెలిపారు. 
 
ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు సీఎం జగన్. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు.