1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Man burns after being hit by high-voltage electric wires while chasing a monkey, video

కోతిని తోలుతూ హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో భగ్గున మండిపోయాడు, వీడియో

Man Electrocuted
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్‌లో తీవ్ర విషాదకర దుర్ఘటన చోటుచేసుకున్నది. రిసార్ట్ పైకప్పుపైకి ఎక్కి వున్న కోతిని తరిమేందుకు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి ఇనుప రాడ్డుతో వెంటబడ్డాడు. ఈ క్రమంలో అతడు పైనే వున్న హైవోల్టేజ్ విద్యుత్ వైర్లకి ఇనుప రాడ్డు తగిలించడంతో ఒక్కసారిగా మండిపోయాడు. అక్కడిక్కకడే మృతి చెందాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఐదు రోజుల క్రితమే ఖజరహో రైల్వే స్టేషనుకి సమీపంలో వున్న ఓ రిసార్టులో ఉద్యోగంలో చేరాడు. ఐతే మంగళవారం నాడు ఓ కోతి రిసార్ట్ పైకప్పు ఎక్కి అలజడి సృష్టిస్తోంది. దీనితో రైక్వార్ పొడవైన ఓ ఇనుప రాడ్డు తీసుకుని కోతిని తరిమేందుకు వెంటబడ్డాడు. అలా తరమేసాక రాడ్డును కాస్త పైకి ఎత్తాడు. రిసార్ట్ పైకప్పుకి దగ్గర్లో వున్న 33 కెవి విద్యుత్ వైర్లు తగిలి ఒక్కసారిగా భగ్గమంటూ మండిపోయాడు. ఈ భయానక దృశ్యం సీసీ కెమేరాలో రికార్డయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
తెలంగాణలోని అవిన్య ప్లాంట్‌లో సరికొత్త హై-స్పీడ్ కిన్లే ప్రొడక్షన్ లైన్‌ను ప్రారంభించిన హెచ్‌సీసీబీ