శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (12:55 IST)

భర్తతో యువతిపై అత్యాచారం చేయించిన భార్య.. వీడియోలు తీసి..

rape
భర్తతో యువతిపై అత్యాచారం చేయించింది ఓ భార్య. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. భార్యే దగ్గరుండి వీడియో తీసి ఎంకరేజ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. బదౌన్‌లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఆ ఇంటి పక్కనే ఓ మైనర్ బాలిక నివాసముంటుంది. 
 
తెలిసిన వారు కావడంతో ఆ బాలిక తరచూ వీరి ఇంటికి వెళ్లేది. అయితే ఈ క్రమంలో సదరు మహిళ భర్త కన్ను బాలికపై పడింది. దీంతో బాలికపై అత్యాచారం చేయడానికి సాయం చేయాలని కోరాడు.
 
దీనికి అంగీకరించిన భార్య.. మైనర్ బాలికను ఇంటికి పిలిపించింది. బాలిక ఇంటికి రాగానే గదిలో వేసి బంధించింది. అనంతరం భర్త.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
భార్య పక్కనే ఉంటూ ఎంకరేజ్ చేసింది. ఫోటోలు, వీడియోలు తీసింది. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. 
 
అయితే రెండు రోజుల తర్వాత నిందితులు ఆ వీడియోను సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో భయపడిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ మేరకు తల్లిదండ్రులకు పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.