శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (10:20 IST)

ఢిల్లీలో మరో నిర్భయ - కారులోనే టెన్త్ విద్యార్థిని అత్యాచారం

victim
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు ఢిల్లీ వసంత విహార్‌లోని మార్కెట్‌లో బాధిత బాలిక పదో తరగతి చదవుతోంది. ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి కారులో ఎక్కించుకున్నారు. నిందితులు ఇద్దరితో పాటు బాలిక స్నేహితుడు కూడా వారితో ఉన్నాడు. 
 
కొంతదూరం వెళ్లిన తర్వాత మహిపాల్‌పూర్ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తీసుకొచ్చి జనసంచార ప్రాంతంలో వదిలిపెట్టారు. 
 
దీనిపై బాధితారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.