సంబంధిత వార్తలు
- భార్య ఉండగానే.. మరో స్త్రీని ఇంటికి తెచ్చుకుని కాపురం పెట్టాడు..
- మళ్లీ పాకిస్తాన్ పిల్లిమొగ్గలు... బుద్ధి చెప్పిన భారత్...
- పుల్వామా అమర జవాన్లకు రూ. 110 కోట్ల భారీ విరాళం... ఆయన దేవుడు కాక మరేమిటి?
- నిజమైన దేశభక్తులు... పుట్టిన బిడ్డకు మిరాజ్ పేరు
- క్విట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్...
కూలిన మరో మిగ్ 21 బైసన్ జెట్..
రాజస్థాన్‌లో ఇవాళ ఫైటర్ జెట్ మిగ్ 21 బైసన్ కుప్పకూలింది. ఈ యుద్ధ విమానం బికనీర్ సమీపంలోని నాల్ వద్ద కూలినట్లు తెలుస్తోంది. కాగా మిగ్‌లో ఉన్న పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. గతవారం భారత్‌పై పాకిస్థాన్ దాడులకు దిగడంతో మిగ్ 21 బైసన్‌లో ప్రయాణించిన భారత్ పైలట్ సైతం యుద్ధ విమానంలో సాంకేతిక లోపం కారణంగా అది కూలడంతో పాకిస్థాన్ భూభాగంపై ల్యాండ్ అయ్యాడు.
అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు విదితమే. ఈ రోజు కూడా మిగ్ కూలిన ఘటన పట్ల కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఓ మిషన్‌లో భాగంగా గాల్లోకి ఎగిరిన మిగ్ 21 బైసన్‌ను ఏదో ఢీకొట్టినట్లు కొందరు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే పక్షి మిగ్‌ని ఢీకొని ఉంటుందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు భావిస్తున్నారు. ఏమైనా కాలం చెల్లిన యుద్ధ విమానాలు భారత్‌కు తెల్ల ఏనుగులుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
తర్వాతి కథనం
