మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (09:36 IST)

నిజమైన దేశభక్తులు... పుట్టిన బిడ్డకు మిరాజ్ పేరు

రాజస్థాన్‌కు చెందిన ఓ జంట తమ దేశ భక్తిని నిరూపించుకున్నారు. పేరు మహావీర్ సింగ్, సోనం సింగ్. వీరిద్దరూ అజ్మీర్ నివాసులు. ఈ దంపతులకు ఈనెల 26వ తేదీన మగబిడ్డ పుట్టాడు. ఈ బిడ్డకు మిరాజ్ రాథోడ్ సింగ్ అని పేరు పెట్టారు. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున దాడులు జరిపి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల కోసం మిరాజ్-2000 రకం యుద్ధ విమానాలను ఉపయోగించారు. 
 
ఈ నేపథ్యంలో ఇదే సమయంలో తమకు పండంటి మగ బిడ్డ పుట్టడంతో మిరాజ్ రాథోడ్ సింగ్ అని నామకరణం చేశారు. బాలుడి తండ్రి మహావీర్‌సింగ్ మాట్లాడుతూ తన కుమారుడు పెద్దవాడయ్యాక సైన్యంలో చేరుతాడన్న నమ్మకం ఉందని, అందుకోసం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.